: కానిస్టేబుల్ కుమార్తెకు కేసీఆర్ భరోసా


తెలంగాణ ఉద్యమం ఎందరో ప్రాణత్యాగాలు చేస్తేనే సాకారమైందని ఉద్యమకారులు చెబుతుంటారు. పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా చేస్తున్న కిష్టయ్య కూడా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారు. అప్పట్లో ఆయన ఆత్మ బలిదానాన్ని అందరూ కీర్తించారు. అయితే, ఆయన కుటుంబంలో మాత్రం తీరని విషాదం నెలకొంది. కిష్టయ్యకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, కుమార్తె ప్రియాంక ఇంటర్మీడియట్ లో 970 మార్కులు సాధించింది. ఆమె మెడిసిన్ చదవాలనుకుంటోంది. ఈ క్రమంలో కిష్టయ్య భార్య పద్మావతి, కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. ఇంటర్లో మంచి మార్కులు సాధించినందుకు కేసీఆర్ ఆమెను అభినందించారు. ఆమె వైద్య విద్య ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. దీంతో, కిష్టయ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News