: ప్రీమియం రైళ్ల స్థానంలో కొత్త తరహా రైళ్లు
దేశంలో ప్రీమియం రైళ్ల స్థానంలో కొత్త తరహా రైళ్లు రాబోతున్నాయి. 'సువిధ' పేరుతో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకం ఛార్జీలు వసూలు చేస్తారని తెలిపింది. డిమాండ్ ఆధారంగా ఈ కొత్త తరహా సర్వీసులు నడిపేందుకు ఆయా రైల్వేజోన్లకే అధికారం కల్పిస్తున్నారు. ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకునేందుకు పది రోజులు, గరిష్ఠ రిజర్వేషన్ పరిమితి 30 రోజులుగా నిర్ణయించినట్టు ప్రకటనలో వివరించింది. మొత్తం ఒకటే తరహాలో ఉండే ఈ ఏసీ రైలులో తత్కాల్ రుసుముతో కలిపి రాజధాని లేదా దురంతో ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించింది.