: రూ. 50 లక్షలు ఎక్కడివి? రూ. 4.50 కోట్ల సంగతేంది?: రేవంత్ కేసులో పీపీ వాదన


హైదరాబాదులోని ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డి కేసు విషయమై వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ కోసం రేవంత్, కస్టడీ కోసం ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ వాదించారు. అంతేకాకుండా, తర్వాత ఇస్తామని చెప్పిన రూ. 4.50 కోట్ల సంగతి కూడా తేల్చాల్సి ఉందని అన్నారు. మరోవైపు, రేవంత్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయనను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.

  • Loading...

More Telugu News