: ఢిల్లీలో రాహుల్ ను కలసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఢిల్లీలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లలిత ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తనకీ అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె రాహుల్ ను కలిశారని సమాచారం. అంతేగాక తెలంగాణలో పార్టీ పరిస్థితి, తదితర అంశాలపై కూడా రాహుల్ తో ఆమె మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News