: భవిష్యత్తులో తెలంగాణలో విద్యుత్ చార్జీలు తగ్గుతాయి: హరీష్ రావు
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడమే చూశామని, ఇప్పుడు మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం గనుక త్వరలోనే మిగులు విద్యుత్ కల సాకారం కాబోతోందని చెప్పారు. కాబట్టి విద్యుత్ చార్జీలు తగ్గడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో హరీష్, ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలసి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని హరీష్ సూచించారు.