: విజయవాడలో రేపు సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం
ప్రభుత్వ కార్యకలాపాలను విజయవాడ నుంచి పాక్షికంగా కొనసాగించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం విజయవాడలోని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రేపు ఆ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగనుంది. శనివారం ఉదయం 8.49 నిమిషాలకు భూమి పూజ జరుగుతుంది. ఆ తరువాత క్యాంప్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు.