: మలేసియాలో భూకంపం... సునామీ ప్రమాదం లేదన్న ప్రభుత్వం
ఆగ్నేయాసియాలో సంపన్న దేశంగా పేరుగాంచిన మలేసియాలో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం వివరాలు తెలియరాలేదు. అయితే ఈ కారణంగా సునామీ ప్రమాదమేమీ లేదని మలేసియా ప్రభుత్వం వెల్లడించింది.