: ఆర్కే నగర్ అసెంబ్లీ బరిలోకి జయలలిత... నేడు నామినేషన్ దాఖలు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నయ్ లోని అర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక బరిలోకి దిగబోతున్నారు. ఈ మేరకు ఆమె నేడు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా తేల్చిన నేపథ్యంలో సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే హోదాను జయలలిత కోల్పోయారు. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తిరిగి సీఎం పీఠమెక్కిన జయలలిత, ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. జయలలిత ఎన్నిక కోసం ఆర్కేనగర్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే ఎన్నికల సంఘం కూడా ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. జయలలిత బరిలోకి దిగుతున్న ఈ స్థానం నుంచి పోటీకి అటు డీఎంకేతో పాటూ పీఎంకే కూడా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో జయలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News