: నవ్యాంధ్ర భూమిపూజకు బంగారు పూత తాపీ, వెండి గమేళా... నవరత్నాలు కూడా!


నవ్యాంధ్ర రాజధాని భూమిపూజకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో రేపటి భూమిపూజకు ఏపీ సర్కారు దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టంగా పరిగణిస్తున్న భూమిపూజకు వినియోగించనున్న తాపీ, గమేళాలను ప్రభుత్వం వెండితో తయారు చేయించింది. కిలో వెండితో తాపీ, గమేళాను తయారు చేయించిన ప్రభుత్వం, తాపీకి బంగారు పూతను పూయించింది. అంగలకుదురుకు చెందిన వెంకట్రామయ్య వీటిని తయారు చేశారు. ఇక నవరత్నాలుగా పిలుచుకునే వైడూర్యం, పుష్యరాగం, పచ్చ, నీలం, కెంపు, వజ్రం, గోమేధకం, పగడం, ముత్యాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో తుళ్లూరు తహశీల్దార్ సుధీర్ బాబు తెనాలిలో వీటిని కొనుగోలు చేశారు.

  • Loading...

More Telugu News