: ‘మ్యాగీ’పై తెలంగాణ సర్కారు వేటు... దేశవ్యాప్తంగా సరుకు వెనక్కు తీసుకుంటామన్న నెస్లే


బహుళ జాతి సంస్థ నెస్లే తయారీ మ్యాగీ నూడిల్స్ పై తెలంగాణ సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగీ నూడిల్స్ లో హానికారక రసాయనాలున్నాయన్న ఆరోపణలతో నూడిల్స్ శాంపిళ్లను తెలంగాణ ప్రభుత్వం ఐపీఎంకు పంపింది. ప్రస్తుతం శాంపిళ్లలో హానికారక రసాయనాల శాతమెంత అన్న అంశంపై పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు పూర్తయ్యేదాకా మ్యాగీ నూడిల్స్ పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే, తమ మ్యాగీ నూడిల్స్ లో హానికారక రసాయనాలున్నట్లు ఆరోపణలు రావడంపై నెస్లే కాస్త ఆలస్యంగా స్పందించింది. నిన్నటిదాకా అలాంటివేమీ లేవంటూ వాదిస్తూ వచ్చిన నెస్లే, తాజాగా నూడిల్స్ కు సంబంధించి దేశవ్యాప్తంగా మార్కెట్ లో ఉన్న స్టాకును వెనక్కు తీసుకునేందుకు సిద్ధపడింది. ఈ మేరకు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది.

  • Loading...

More Telugu News