: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావోత్సవాలు... ఉత్సాహంగా పాలుపంచుకున్న ఎన్నారైలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఈ నెల 2 నాటికి సరిగ్గా ఏడాది అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలను కేసీఆర్ సర్కారు అంగరంగవైభవంగా జరుపుతోంది. 2 నుంచి ఈ నెల 7 దాకా ఆవిర్భావోత్సవాల నిర్వహణకు పక్కా ప్రణాళిక రచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వేడుకలు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. తాజాగా నిన్న అమెరికాలోని పలు నగరాల్లో కూడా తెలంగాణ ఆవిర్భావోత్సవాలు వేడుకగా జరిగాయి. కొలంబస్, బోస్టన్, మినియాపోలిస్, అట్లాంటా, ఫ్లోరిడాతో పాటు పలు నగరాల్లో టీఆర్ఎస్-యూఎస్ఏ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.