: చంద్రబాబే అంతా చేయించారని చెప్పమంటున్నారు: మత్తయ్య


రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో ఏ4 నిందితుడు మాథ్యూ జెరూసలేం అలియాస్ మత్తయ్య విజయవాడలో ఏబీఎన్ చానల్ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ... ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబే అంతా చేయించారంటూ స్టేట్ మెంట్ ఇవ్వాలని తనను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రెండుమూడు రోజులుగా ఈ విషయమై తనకు బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. చెప్పినట్టు చేస్తే రూ.15 లక్షలిస్తామని ప్రలోభపెడుతున్నారని వివరించారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. త్వరలోనే లొంగిపోతానని స్పష్టం చేశారు. చంద్రబాబును కూడా ఈ కేసులోకి లాగేందుకు బలమైన యత్నాలు జరుగుతున్నాయని, రాజకీయ కోణంలోనే రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారని తెలిపారు.

  • Loading...

More Telugu News