: రూ. 760 కోట్లతో 'స్కావా'ను విలీనం చేసుకున్న ఇన్ఫోసిస్


ఇ-కామర్స్ సేవలందిస్తున్న స్కావా, దాని మాతృసంస్థ కల్లిడస్ ఐఎన్సీలను విలీనం చేసుకున్నట్టు ఇండియాలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతి సంస్థ ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ డీల్ కోసం 120 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 760 కోట్లు) వెచ్చించామని, నేటితో విలీన ప్రక్రియ పూర్తయిందని సంస్థ తన వెబ్ సైట్లో వెల్లడించింది. ఈ విలీనం గురించి ఏప్రిల్ 24న తొలిసారిగా ప్రకటించామని, క్లయింట్లకు ఐపీ-ఆధారిత సాంకేతిక సేవలను, సరికొత్త ఆటోమేషన్ టూల్స్ ను అందించేందుకు ఈ డీల్ ఉపకరిస్తుందని ఇన్ఫీ వ్యాఖ్యానించింది. కాగా, ఈ సంవత్సరం ఇన్ఫీకి ఇది రెండో పెద్ద డీల్. రెండు నెలల క్రితం ఇజ్రాయిల్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ పనయాను 200 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 1275 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News