: అనంతలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక మెడికల్ కళాశాలలో చదువుతున్న కర్నూలు విద్యార్థిని స్వర్ణకుమారి హాస్టలులో ఉంటుంది. ఈ క్రమంలో నేటి ఉదయం హాస్టలు గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనను గమనించిన ఇతర విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. స్వర్ణకుమారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. అమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయమై సమాచారం లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.