: మ్యాగీ కన్నా గాలి, నీరు అధిక కలుషితం... తింటామంటున్న నెటిజన్లు
పలు రాష్ట్రాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న '2 మినిట్' నూడుల్స్ 'మ్యాగీ'ని తింటామని అత్యధికులు అంటున్నారు. మ్యాగీతో పోలిస్తే పీల్చే గాలి, తాగే నీరూ మరింత కలుషితమని నెటిజన్లు భావిస్తున్నారు. ఓ వార్తా సంస్థ మ్యాగీ తింటారా? అని ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తే, 37 శాతం మంది తింటామని, 20 శాతం మంది ప్రభుత్వ నిర్ణయం వెలువడేదాకా వేచి చూస్తామని, మరో 8 శాతం మంది షాపులో రిటర్న్ ఇచ్చేస్తామని వెల్లడించగా, మిగిలిన వారు ఇకపై తినబోమని వెల్లడించారు. మ్యాగీ అమ్మకాలపై నేటి సాయంత్రంలోగా కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.