: దేశం నేత ఇంట పెళ్లి వేడుకలో రికార్డింగ్ డ్యాన్సులు!


ఓ తెలుగుదేశం పార్టీ మహిళా నేత తన ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకల్లో అతిథులను అలరించేందుకు రికార్డింగ్ డ్యాన్సును ఏర్పాటు చేసి వివాదం కొనితెచ్చుకుంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. రికార్డింగ్ డ్యాన్సర్లను, గ్రామ సర్పంచ్ బద్దపు లక్ష్మి కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శోంఠ్యాం గ్రామ గ్రామ సర్పంచ్ లక్ష్మి చిన్న కుమారుడు ప్రసాద్ పెళ్లి వేడుకల్లో భాగంగా, రికార్డింగ్ డ్యాన్సర్లను పిలిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పెళ్లి కొడుకు అన్న శ్రీనివాస్ సహా అసభ్య నృత్యాలు చేస్తున్న ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో రికార్డింగ్ డ్యాన్సులపై నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News