: ఏసీబీ కాదు... ఆ సీడీలను సర్కారే విడుదల చేసింది: ఏపీ మంత్రి కామినేని


ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి జైలుపాలవడంపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడంటూ, అందుకివే సాక్ష్యాలంటూ మీడియాలో ప్రసారమైన క్లిప్లింగ్స్ ను విడుదల చేసింది ఏసీబీ కాదని స్పష్టం చేశారు. ఈ వీడియోలను ప్రభుత్వమే విడుదల చేసినట్టు తెలిసిందని అన్నారు. అసలు, ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఇక, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఇరికించాలని ప్రయత్నించడం దారుణమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుపై కేసు పెట్టేందుకు టి.సర్కారు అవకాశాలు వెదుకుతుండడం వారి కక్ష సాధింపు ధోరణికి పరాకాష్ఠ అని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డిని ఉచ్చులో ఇరికించారని అన్నారు.

  • Loading...

More Telugu News