: తప్పు చెయ్యలేదని నిరూపించుకో!: బాబుకు రఘువీరా సవాల్
రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబుకు ప్రమేయం లేకుంటే, ఆ విషయాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, చంద్రబాబునాయుడు ఒకే పాఠశాలకు చెందిన వారని అన్న ఆయన, ఓటుకు నోటు వ్యవహారంలో బాబుకు ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇప్పటివరకూ బాబు స్పందించకపోవడాన్ని చూస్తుంటే ఆయనకు తెలిసే అంతా జరిగిందని భావించాల్సి వస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేసినా తప్పేనని, చంద్రబాబు తన నోటి గుండా రేవంత్ తప్పు చేశాడని ఇంతవరకూ ఎందుకు అనలేదని దుయ్యబట్టారు.