: 'రాష్ట్రానికి మోసగాడు' పేరిట చంద్రబాబుపై వైసీపీ పుస్తకం
గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సమరదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకాన్ని వైసీపీ అధినేత జగన్ విడుదల చేశారు. అందులో బాబు పాలనలో మోసాలు, ఇతర విషయాలను ప్రస్తావించారు. ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారు, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారనే విషయాలపై ఆ పుస్తకంలో ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలన్నారు.