: కోక్ క్యాన్ ను ఆయుధంలా ఉపయోగిస్తే?: విమానంలో ముస్లిం యువతిపై ఎయిర్ హోస్టెస్ వివక్ష


విమానంలో ప్రయాణిస్తున్న ఓ ముస్లిం యువతి తాగేందుకు సోడా క్యాన్ ను ఓపెన్ చెయ్యబోతే, ససేమిరా అందో ఎయిర్ హోస్టెస్. ఈ డైట్ కోక్ క్యాన్ ను ఆయుధంలా ఉపయోగిస్తే ఎలా? అన్నది ఆ ఎయిర్ హోస్టెస్ సందేహం. ఈ ఘటన చికాగో నుంచి వాషింగ్టన్ వెళుతున్న 'షటిల్ అమెరికా ఫర్ యునైటెడ్' విమానంలో జరిగింది. తాహెరా అహ్మద్ అనే యువతి పట్ల ఈ వివక్షను చూపిన ఫ్లయిట్ అటెండెంట్ ను విధుల నుంచి తప్పించినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తనను క్యాన్ తెరిచేందుకు అంగీకరించని అటెండెంట్, తన పక్కనున్న వ్యక్తి బీరు క్యాన్ తెరచి తాగుతుంటే ఎంతమాత్రమూ అడ్డుకోలేదని బాధితురాలు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టింది. పక్కనున్న వారు సైతం ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని వాపోయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, 'షటిల్ అమెరికా' స్పందించింది. అహ్మద్ తమ కస్టమర్ అని, ఆమెకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. కాగా, ఈ ఎయిర్ లైన్స్ సంస్థను బహిష్కరించాలని ట్విట్టర్ మాధ్యమంగా ప్రచారం మొదలైంది.

  • Loading...

More Telugu News