: రేవంత్ రెడ్డికి జైల్లో లభించే ప్రత్యేక సదుపాయాలివే!


తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డిని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోర్టు ఆదేశించడంతో ఆయనకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని చర్లపల్లి జైలు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా, రేవంత్‌రెడ్డి ఇతర ఖైదీల మాదిరిగా బ్యారక్ లో కాకుండా, ప్రత్యేకంగా ఓ గదిలో ఉండొచ్చు. వంట కూడా వేరుగా, తనకు నచ్చిన రీతిలో స్వయంగా చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం స్టవ్, గిన్నెలు వంటి వస్తువులను అందిస్తారు. అవసరమని భావిస్తే, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు. ఫ్యాన్, టీవీ వంటి సదుపాయాలూ ఉంటాయి. నేటి నుంచి రేవంత్ కు ఈ 'స్పెషల్' సౌకర్యాలు లభించనున్నాయి.

  • Loading...

More Telugu News