: రాజకీయాల్లోకి వస్తానంటున్న హీరోయిన్ ప్రియా హసన్
ప్రముఖ శాండల్ వుడ్ నటి ప్రియా హసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెబుతోంది. 'బిందాస్ హుడుగి', 'జంభద హుడుగి' వంటి యాక్షన్ చిత్రాల ద్వారా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియ త్వరలో జరిగే బీబీఎంపీ ( బృహత్ బెంగళూరు మహానగర పాలికె) ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగనున్నట్టు సమాచారం. కాగా, కన్నడ నటీమణులు రమ్య, రక్షిత, పూజా గాంధీ వంటి వారు గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు ఎలా నెగ్గుకొస్తుందో వేచి చూడాలి. ఆమె నటించిన మరో యాక్షన్ మూవీ 'స్మగ్లర్' అతి త్వరలో విడుదల కానుంది.