: మరో వివాదంలో మన్మోహన్... ఆయన చొరవతోనే టైట్లర్ కు క్లీన్ చిట్: విచారణకు కోర్టు ఆదేశాలు
ఇప్పటికే పలు కుంభకోణాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న జగదీష్ టైట్లర్ కు క్లీన్ చిట్ రావడం వెనుక మన్మోహన్ సింగ్ హస్తముందని ఆయుధాల వ్యాపారి, భారత నౌకాదళ రహస్యాలు బయటకు వెల్లడించిన కేసులో నిందితుడిగా వున్న అభిషేక్ వర్మ సీబీఐ విచారణలో వెల్లడించారు. ఈ వివరాలన్నింటినీ పొందు పరిచిన నివేదికను ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు సీబీఐ అందజేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, దీనిపై మరింత దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ, కేసు విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. కాగా, టైట్లర్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సాక్షి గతంలోనే మరణించినందున, ఆ ఆరోపణపై దర్యాప్తు చేయటం ప్రస్తుతం సాధ్యం కాదని సీబీఐ పేర్కొంది.