: గోవాలో దారుణం... ఇద్దరు యువతులపై హైదరాబాదీ సహా ఐదుగురు మృగాళ్ల అఘాయిత్యం
గోవాలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులపై ఐదుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు గదిలో నిర్బంధించి, అత్యంత పాశవికంగా హింసిస్తూ సాగిన ఈ దారుణంలో యువతులకు ఎట్టకేలకు పోలీసులు విముక్తి కల్పించారు. గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు యువతులను పోలీసులమని చెప్పుకున్న ఐదుగురు యువకులు మాదక ద్రవ్యాల సోదాల పేరిట తమ గదికి తరలించారు. యువతులు వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ ను కారులోనే నిర్బంధించిన దుండగులు, బాధితులపై రెండు రోజుల పాటు తమ అకృత్యాన్ని కొనసాగించారు. కారు నుంచి బయటపడ్డ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో దాడులు చేసిన పోలీసులు యువతులను కాపాడారు. పోలీసుల రాకను గమనించిన దుండగులు పరారయ్యారు. అయితే పలు హోటళ్లలో ముమ్మర తనిఖీలు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. నిందితుల్లో హైదరాబాదుకు చెందిన కమలేశ్ చౌదరి అనే యువకుడున్నాడు.