: రోహిత్ లాంటి ప్రమాదకర క్రికెటర్ ను చూడలేదు: విరాట్ కోహ్లీ
టీమిండియా స్ట్రోక్ ప్లేయర్ రోహిత్ శర్మపై టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ లాంటి ప్రమాదకర క్రికెటర్ ను తాను ఇప్పటిదాకా చూడలేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. క్రీజులో రోహిత్ కుదురుకున్నాడంటే, ప్రత్యర్థికి ఇక చుక్కలు కనబడటం ఖాయమేనని అతడు పేర్కొన్నాడు. రోహిత్ లో గణనీయ మార్పు రావడానికి గల కారణాలను కూడా కోహ్లీ ప్రస్తావించాడు. టీ20లో రాణించడం రోహిత్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్లలో రోహిత్ క్రీజులో ఉన్నాడంటే, ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లేనని కోహ్లీ పేర్కొన్నాడు.