: గోదావరి పుష్కరాలకు రాహుల్ గాంధీ వస్తున్నారట!


త్వరలోనే గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పుష్కర స్నానం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ వెల్లడించారు. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. రాజమండ్రిలో ఆయన పుష్కర స్నానం ఆచరిస్తారని తెలిపారు. పండితుల సలహా మేరకు ఆయన ఏ తేదీన వస్తారో తెలియజేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News