: విశాఖ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం స్వాధీనం


ఇంతవరకు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుబడుతూ వస్తోంది. తాజాగా విశాఖ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ముందస్తు సమాచారంతో ఏడుగురు ప్రయాణికులను తనిఖీ చేయగా, 4.2 కిలోల బంగారాన్ని వారి వద్ద కనుగొన్నారు. దాని విలువ 1.14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు పట్టుబడిన ప్రయాణికులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News