: మ్యాగీ వివాదంపై స్పందించిన అమితాబ్
ప్రముఖ సంస్థ నెస్లే తయారు చేస్తున్న మ్యాగీ నూడుల్స్ లో హానికారక రసాయనాలు ఉన్నాయన్న ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ వివాదంలో, గతంలో మ్యాగీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ పై కూడా కేసు నమోదయింది. దీనిపై స్పందించిన బిగ్ బీ, న్యాయ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అయితే, దీనికి సంబంధించి అధికారుల నుంచి తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.