: 'మ్యాగీ' వివాదంపై ప్రీతీ జింటా స్పందన
మ్యాగీ నూడుల్స్ వివాదంలో తన పేరును కూడా లాగడంపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ లో అసంతృప్తిని వ్యక్తం చేసింది. "12 ఏళ్ల కిందట నేను మ్యాగీ ప్రకటన చేసిన కారణంగా నాపై కేసు నమోదు చేసిన వార్తను చదివాను. అదెప్పుడో పన్నెండు సంవత్సరాల కిందట చేసింది. ఇప్పుడెలా నాపై కేసు వేస్తారు? ఎలా సాధ్యమవుతుంది?" అని ప్రీతి ప్రశ్నించింది. గతంలో మ్యాగీ ప్రకటనలో నటించిన మాధురీ దీక్షిత్, అమితాబ్ బచ్చన్ లతో పాటు ప్రీతిపైన యూపీ కోర్టులో కేసు దాఖలైంది.