: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దొంగాట ఆడింది: చంద్రబాబు


తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దొంగాట ఆడిందని, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం మార్చాలని, దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలని చంద్రబాబు కోరారు. సమైక్యవాదాన్ని వినిపించిన జగన్ టీఆర్ఎస్ కు మద్దతివ్వడం అనైతికమన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు తనను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News