: స్టేట్ హోం నుంచి ఐదుగురు 11 మంది యువతుల పరారీ
హైదరాబాదులోని స్టేట్ హోంలో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. అమీర్ పేటలోని స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న యువతుల్లో 11 మంది మాయమయ్యారు. స్టేట్ హోం భవనంలోని కిచెన్ తలుపును బద్దలు కొట్టిన యువతులు గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. పరారైన వారిలో ఐదుగురు అనాధ యువతులున్నారు. యువతులు పరారైన విషయాన్ని నిర్ధారించుకున్న స్టేట్ హోం నిర్వాహకులు వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్టేట్ హోంను పరిశీలించిన పోలీసులు పరారైన యువతుల కోసం గాలింపు చేపట్టారు.