: ‘ఓటుకు నోటు’లో ప్రధాన కుట్రదారు చంద్రబాబే... ఆధారాలున్నాయి:నాయిని సంచలన వ్యాఖ్య


తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఆయన వరంగల్ లో మీడియాతో అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే ప్రధాన కుట్రదారుడని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పక్కా ఆధారాలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు పోలీసుల వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News