: తస్లీమా నస్రీన్ మకాం మారింది... అమెరికా చేరిన ‘లజ్జా’ రచయిత్రి!
‘లజ్జా’ నవలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ నిత్యం భయంభయంగానే బతుకు వెళ్లదీస్తున్నారు. బంగ్లాదేశ్ ఇస్లామిక్ మతఛాందసవాదుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో కొంతకాలం పాటు భారత్ లో తలదాచుకున్న ఆమె తాజాగా అమెరికా శరణువేడారు. ఇటీవల స్వదేశం చేరిన నస్రీన్ అక్కడే ఉంటున్నారు. గడచిన మూడు నెలల్లోనే ఆ దేశంలో మతఛాందసవాదుల చేతిలో ముగ్గురు బ్లాగర్లు ప్రాణాలొదిలారు. తాజాగా నిన్నూ చంపేస్తామంటూ మతఛాందసవాదుల నుంచి తస్లీమాకు బెదిరింపులు వచ్చాయట. దీంతో బెంబేలెత్తిపోయిన తస్లీమా, నేరుగా అమెరికా వెళ్లిపోయారు. ఇక తస్లీమాకు ప్రాణాపాయం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో న్యూయార్క్ అడ్వొకసీ గ్రూపునకు చెందిన 'సెంటర్ ఫర్ ఇంక్వైరీ’ భద్రత కల్పిస్తోందట. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న తస్లీమా ‘‘అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా. ఇది ఎగుమతి చేసిన ప్యాకే’’ అని నిన్న ట్విట్టర్ లో పేర్కొన్నారు.