: పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీదే... టెలీ కాన్ఫరెన్స్ లో నేతలతో చంద్రబాబు
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేచింది. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పరాజయం, ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏపీలో జరగనున్న ఎన్నికలపై టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. నేటి ఉదయం ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ నేతలకు ఆయన సూచించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని, అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.