: ఢిల్లీ వెళ్లిరావడం తప్ప ఏం సాధించారు?: చంద్రబాబు ఏడాది పాలనపై సీపీఎం నేత పుణ్యవతి విమర్శ
ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం నారా చంద్రబాబునాయుడు ఏడాది అవుతున్నా ఏం సాధించారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి ప్రశ్నించారు. సీఎం హోదాలో వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్లిరావడం తప్ప చంద్రబాబు సాధించిన ఘనత ఏమీ లేదని ఆమె ఆరోపించారు. అసలు ఏం సాధించారని నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నారని కూడా ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పార్టీ సమీక్షకు వచ్చిన పుణ్యవతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు, మోదీతో కలిసి పనిచేస్తున్నా, రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు ఎందుకు విఫలమవుతున్నారో తమకు అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.