: ఈ నెల 7న వైసీపీలోకి బొత్స సత్తిబాబు!


ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగానే కాక పీసీసీ చీఫ్ గా ఓ వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ వైసీపీ కండువా కప్పుకునే ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన బొత్స సత్తిబాబు, అందుకు ఈ నెల 7ను సుముహూర్తంగా ఎంచుకున్నారట. భారీ అనుచరగణంతో బొత్స సత్తిబాబు ఈ నెల 7న వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బొత్స అనుచరులు కూడా తామంతా తమ నేత వెంటేనని ఇప్పటికే తేల్చిచెప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమణమూర్తి తానూ బొత్స వెంటేనని ప్రకటించారు. దీంతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే ప్రమాదం లేకపోలేదు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స చేరిక తమకు లాభిస్తుందని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News