: అనంతపురం జిల్లాలో ఏఎస్సైపై వేట కొడవలితో దాడి... పరిస్థితి విషమం


అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏఎస్సై పైనే హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఉరవకొండలో ఏఎస్సైగా పనిచేస్తున్న మహేంద్రను... గుంతకల్లులోని అతని నివాసంలో రామాంజనేయులు అనే రౌడీ షీటర్ వేటకొడవలితో నరికి హత్య చేయబోయాడు. ఈ ఘటనలో ఏఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రౌడీ షీట్ పెట్టారన్న కక్షతోనే తనపై దాడి చేశాడని ఈ సందర్భంగా మహేంద్ర చెప్పారు.

  • Loading...

More Telugu News