: రైల్వే జీఎంను నిలదీసిన టీటీడీ చైర్మన్ చదలవాడ
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాస్తవను తిరుపతి రైల్వే స్టేషన్ విషయమై నిలదీశారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు గానీ, అందుకు అవసరమైన స్థలం ఎంపిక చేయలేదని విమర్శించారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వెళుతున్నారే తప్ప, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా తిరుపతి రైల్వే స్టేషన్ అనాదరణకు గురైందని చదలవాడ పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ ఆవేదనను అర్థం చేసుకున్న జీఎం శ్రీవాస్తవ, విషయాన్ని రైల్వే బోర్డుకు వివరిస్తానని స్పష్టం చేశారు.