: రూ. 10 విలువైన వాటాకు రూ. 3.62 లక్షలు... సొంత కంపెనీకే 'బొక్క' పెట్టిన విజయ్ మాల్యా


ఒకప్పటి లిక్కర్ కింగ్, ప్రస్తుతం దివాలా తీసిన పారిశ్రామికవేత్తగా ఉన్న విజయ్ మాల్యా గతంలో చేసిన మరో నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. అటు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్), ఇటు ఐపీఎల్ బెంగళూరు ఫ్రాంచైజీల్లో ఆయన హవా సాగుతున్న వేళ సొంత లెక్కలు కట్టి రూ. 10 ముఖ విలువ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాటాలను ఏకంగా రూ. 3,62,240 చొప్పున యూఎస్ఎల్ కు అంటగట్టాడట. ఈ లావాదేవీలో యూఎస్ఎల్ కు చెందిన రూ. 170 కోట్లను రాయల్ చాలెంజర్స్ ఖాతాకు బదలాయించారని తాజాగా వెల్లడైంది. 2011 నాటికి ఐపీఎల్ ప్రారంభమై మూడు సంవత్సరాలే అయింది. మూడేళ్ల బ్రాండ్ వాల్యూతో సంస్థ విలువను అమాంతం పెంచేసి నమ్మశక్యం కాని ధరకు ఆయన వాటాలను బదలాయించుకొని ఐపీఎల్ ఫ్రాంచైజీని అడ్డు పెట్టుకుని యూఎస్ఎల్ డబ్బు కాజేశాడన్నది ఆరోపణ. ఆ సమయంలో కేవలం విరాట్ కోహ్లీని మాత్రమే అంటిపెట్టుకున్న విజయ్ మాల్యా మిగతా ఆటగాళ్లందరినీ వదులుకున్నాడు. సుమారు రూ. 55 కోట్లు వెచ్చించి ఏబీ డివిలియర్స్, సౌరభ్ తివారీ వంటి వాళ్లను కొనుక్కున్నాడు. కాగా, 2013లో యూఎస్ఎల్ ను డియాజియోకు విక్రయించిన మాల్యాకు ప్రస్తుతం ఆ సంస్థలో ఉన్నది నామమాత్రపు వాటాయే.

  • Loading...

More Telugu News