: ఇకపై ఏ ఎన్నికలొచ్చినా... విజయం మాదే: టీఆర్ఎస్ ఎంపీ కవిత


ప్రజల విశ్వాసం చూరగొన్న టీఆర్ఎస్ కు ఇకపై అన్నీ విజయాలేనని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నేటి ఉదయం నిజామాబాదులో కవిత జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సిద్ధంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, ఇకపై ఏ ఎన్నికలొచ్చినా తమదే గెలుపని ఆమె పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్న ఆమె, రాష్ట్రం వారికే అంకితమన్నారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News