: రెండో ప్రాధాన్యత ఓటును 'నోటా'కు వేసిన బీజేపీ... అమిత్ షా సూచనలతోనే అలా చేశారా?


నిన్న జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తమ మిత్రపక్షమైన టీడీపీకి వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు... రెండో ప్రాధాన్యత ఓటును మాత్రం నోటాకు వేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మొదటి ఓటును టీడీపీకి వేశాక... రెండో ఓటు నోటాకు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం వల్లే బీజేపీ నేతలు ఇలా చేశారని విశ్లేషిస్తున్నారు. 'నోటుకు ఓటు' వ్యవహారం నేపథ్యంలో, జరిగిన పరిణామాలను తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తెలంగాణ బీజేపీ నేతలు తెలియజేశారని... ఆయన సూచనల మేరకే బీజేపీ ఎమ్మెల్యేలు ఇలా చేశారని మరికొందరు అంటున్నారు. మరి, దీనిపై బీజేపీ నేతలు ఏం వివరణ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News