: బీహార్ పోలీసు అధికారులను 'అద్దె'కు తెచ్చుకుంటున్న కేజ్రీ సర్కారు


అవినీతిని అంతమొందించేందుకు ప్రారంభించిన యాంటీ కరప్షన్ బ్రాంచ్ (ఏసీబీ) నిర్వహణను మరింత పకడ్బందీ చేసేందుకు బీహారుకు చెందిన పోలీసు అధికారులను కేజ్రీవాల్ సర్కారు పిలిపించుకుంటోంది. ఇప్పటికే ఐదుగురు బీహార్ పోలీసులు ఏసీబీలో చేరినట్టు తెలుస్తోంది. ఇద్దరు సీఐ, ముగ్గురు ఎస్ఐ స్థాయి అధికారులు ఢిల్లీ సర్కారు కిందకు డిప్యుటేషన్ పై వచ్చారు. అంతకుముందు బీహార్ సర్కారుకు లేఖను రాస్తూ, తమకు కొందరు పోలీసు అధికారులను పంపించాలని కేజ్రీ సర్కారు కోరింది. ఏసీబీ చట్టపరిధి ఏ మేరకు? అన్న విషయమై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో, బీజేపీయేతర ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాష్ట్రాల సహకారాన్ని తీసుకోవడం ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెంచాలన్నది కేజ్రీ ఆలోచనగా తెలుస్తోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఢిల్లీ సర్కారుకు వ్యతిరేకంగా తెస్తున్న నోటిఫికేషన్ల గురించి బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చించారు. కాగా, కేజ్రీ తాజా అడుగులతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో జరుగుతున్న రాజకీయ యుద్ధం మరింతగా ముదరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News