: మోదీని అరెస్ట్ చేస్తే రూ.100 కోట్లిస్తా... పాక్ పార్టీ జమాతే ఇస్లామీ చీఫ్ ప్రకటన


పాకిస్థాన్ కు చెందిన రాజకీయ పార్టీ జమాతే ఇస్లామీ అధినేత సిరాజ్ ఉల్ హక్ నిన్న ఓ సంచలన ప్రకటన చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీని అరెస్ట్ చేసిన వారికి రూ.100 కోట్లిస్తానని అతడు చేసిన ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్ కోట్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సిరాజ్ చేసిన ఈ ప్రకటన ఇరు దేశాల్లో సంచలనం రేపింది. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ ను భారత్ అరెస్ట్ చేయలేదని అతడు తేల్చి చెప్పాడు. ఈ సందర్భంగా అతడు మోదీని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నువ్వు, నీ ఏజెంట్లు సలావుద్దీన్ ను అరెస్ట్ చేయలేరని నేను మోదీకి చెప్పాలనుకుంటున్నాను. సలావుద్దీన్ ను అరెస్ట్ చేసిన వారికి రూ.50 కోట్లిస్తామని మీరన్నారు. నేను కూడా ఒకటి చెప్పదలచుకున్నా. మోదీని అరెస్ట్ చేసిన వారికి రూ.100 కోట్లిస్తాం’’ అని అతడు అన్నాడు. భారత్ తో స్నేహ సంబంధాలు కోరుకునేవారెవరైనా పాక్ ద్రోహులేనని అతడు ప్రకటించాడు. అలాంటి వారికి పాక్ లో చోటు లేదని, వారంతా హిందూస్థాన్ వెళ్లిపోవాలని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News