: టీ ఉద్యోగుల నుంచి రక్షణ కల్పించండి: గవర్నర్ కు ఏపీఎన్టీఓల ఫిర్యాదు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాటి నుంచి టీ ఉద్యోగుల నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నాయని ఏపీఎన్జీఓ నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిన్న ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు నేతృత్వంలో రాజ్ భవన్ కు వెళ్లిన నేతలు గవర్నర్ ముందు తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. ప్రైవేట్ ఆస్తిగా ఉన్న ఏపీఎన్జీఓ హోంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని టీ ఉద్యోగులు బెదిరిస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే జరిగితే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. అయినా తమ హోంలో టీ ఉద్యోగులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఏపీ ఉద్యోగులుగా తాము హోంలో నవ నిర్మాణ దీక్ష చేయాలనుకుంటున్నామని, భద్రత కల్పించాలని కోరారు.