: రేవంత్ రెడ్డి వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న జగన్


రేవంత్ రెడ్డి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ రేపు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జగన్ పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళతారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కోసం రేవంత్ రెడ్డి ముడుపులు ముట్టజెపుతున్న వీడియో టేపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. అందులో 'బాస్' అని రేవంత్ పేర్కొనడంతో, ఎవరా బాస్? చంద్రబాబేనా? అంటూ అనుమానాలు రేకెత్తాయి.

  • Loading...

More Telugu News