: ఏకే ఖాన్ మీడియాలో ప్రకటించేలోపే వీడియోలు ఎలా లీకయ్యాయి?: రావుల
రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంపై తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి స్పందించారు. ఏసీబీ డైరక్టర్ జనరల్ ఏకే ఖాన్ మీడియాలో ప్రకటించేలోపే రేవంత్ రెడ్డి వీడియోలు ఎలా లీకయ్యాయని ప్రశ్నించారు. దీంతో, ఓ విషయం స్పష్టమైందని, టీఆర్ఎస్, వైసీపీ మధ్య ఒప్పందాలు కుదిరినట్టు రూఢీ అయిందని అన్నారు. అయినా, 63 మంది ఎమ్మెల్యేల బలంతో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలా పోటీ చేస్తారని రావుల నిలదీశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతో ఈ రెండు పార్టీల మధ్య ముసుగు తొలగిపోయిందని అన్నారు.