: ప్లీజ్... మా దేశంలో ఆడండి, పాక్ కు అండగా నిలవండి: మిస్బా


పాకిస్థాన్ లో జింబాబ్వేతో జరిగిన సిరీస్ విజయవంతమైందని పాక్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఇతర జట్లు కూడా పాకిస్థాన్ లో పర్యటించాలని... పాక్ కు అండగా నిలవాలని విన్నవించాడు. ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ లో ఓ అంతర్జాతీయ సిరీస్ జరిగింది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, ప్రధాన జట్లతో పాటు చిన్న జట్లు కూడా పాక్ లో ఆడటానికి నిరాకరిస్తుండటంతో... పాక్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు జరగలేదు. ఈ క్రమంలో, జింబాబ్వే పర్యటన ప్రశాంతంగా ముగిసిందని, ఇతర జట్లు కూడా పాక్ లో పర్యటించి... తమ దేశంలో క్రికెట్ ను ఆదుకోవాలని మిస్బా కోరాడు.

  • Loading...

More Telugu News