: రేవంత్ రెడ్డికి చర్లపల్లే బెస్టు: కోర్టుకు చంచల్ గూడ అధికారుల లేఖ
చంచల్ గూడ జైలులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి భద్రత కల్పించలేమని జైలు అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి లేఖ రాశారు. చంచల్ గూడ జైలులో బ్యారక్స్ అన్నీ నిండిపోయాయని, పైగా ఇక్కడ ఐఎస్ఐ ఖైదీలు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ కు భద్రత కల్పించలేమని స్పష్టం చేశారు. అందుకే రేవంత్ ను చర్లపల్లి జైలుకు తరలించాలని లేఖలో కోరారు. అంతేగాకుండా, ఏసీబీ జ్యూరిస్ డిక్షన్ ప్రకారం ఈ వ్యవహారం చర్లపల్లి జైలు పరిధిలోకి వస్తుందని అధికారులు వివరించారు. ఈ అంశాలను పరిశీలించి, అనుమతి ఇస్తే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలిస్తామని పేర్కొన్నారు.