: బాబుపై కేసు నమోదు విషయమై ఆలోచిస్తున్నాం: కవిత
తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని... ఇక, దుకాణం మూసుకోవాల్సిందే అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. రాజకీయ కుతంత్రాల్లో చంద్రబాబు ఆరితేరారని... ఆయన కుతంత్రాలు చేస్తారనడానికి రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారమే సాక్ష్యం అని ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసే విషయమై చట్టపరంగా ఆలోచిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్ కుట్ర ఉందన్న ఆరోపణలను ఆమె ఖండించారు.