: మరో విదేశీ పర్యటనకు సిద్ధమైన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎల్లుండి నుంచి ఐదు రోజులపాటు మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలే సుదీర్ఘ అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన, ఈ దఫా తైవాన్, హాంకాంగ్, మలేషియాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మూడు దేశాల్లోని హార్డ్ వేర్ పార్కులు, కంపెనీలను సందర్శించనున్నారు. తెలంగాణలో ఐటీ విస్తరణ, పెట్టుబడులకు గల అవకాశాలను గురించి మూడు దేశాల ఇన్వెస్టర్లకు ఆయన వివరణ ఇవ్వనున్నారు. పెట్టుబడులతో తెలంగాణకు తరలివచ్చే కంపెనీలకు కావాల్సిన అనుమతులను ఏకగవాక్ష (సింగిల్ విండో) విధానం ద్వారా త్వరితగతిన ఇస్తామని ఆయన మరోసారి స్పష్టం చేయనున్నారు.